హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పోలీస్ అమరవీరుల కుటుంబాలకు చెక్కులు పంపిణీ

నెల్లూరు నగరంలో బుధవారం ఘనంగా పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రజల ప్రాణ రక్షణే పరమ ధ్యేయంగా విధి నిర్వహణలో ప్రాణాలర్పించిన పోలీసులకు ఘన నివాళులర్పించారు. జిల్లాలో ఈ ఏడాది అసువులు బాసిన 9 మంది పోలీసుల కుటుంబాలకు రూ.50 వేల చొప్పున కలెక్టర్ హిమాన్షు శుక్లా, ఎస్పీ అజిత వేజెండ్ల చెక్కులు అందజేశారు.