హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అమరవీరులకు ఘన నివాళులు

PPM: పోలీసు అమరవీరుల త్యాగాలు సమాజానికి నిరంతరం స్ఫూర్తినిస్తాయని జిల్లా కలెక్టర్ డా.ఎన్. ప్రభాకర్ రెడ్డి అన్నారు. ఇవాళ పార్వతీపురంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ఎస్పీ ఎస్.వి. మాధవ్ రెడ్డి ఆధ్వర్యంలో పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్, ఎస్పీ అమరవీరుల స్మృతి స్థూపం వద్ద పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళులర్పించారు.