హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

చిట్వేలిలో మొదలైన MPTC నామినేషన్ల పర్వం

అన్నమయ్య: చిట్వేలిలో మండల ప్రాదేశిక సభ్యుల ఎన్నికలకు నామినేషన్లు మొదలయ్యాయి. పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు గావించారు. నామినేషన్ వేసే అభ్యర్థి, అతనితోపాటు ఇద్దరు ప్రతిపాదకులను మాత్రం నామినేషన్ కేంద్రంలోకి ఎస్సై వినోద్ కుమార్ అనుమతిస్తున్నారు. ప్రస్తుతానికి నామినేషన్లు చేస్తున్న ఎంపీడీవో కార్యాలయం వద్ద ప్రశాంత వాతావరణం ఉంది.