హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

భీమిలిలో 3 స్థానాలకే జనసేన పరిమితం

VSP: విశాఖ GVMC ఎన్నికల్లో భీమిలి రాజకీయం ఆసక్తికరంగా మారింది. తొలుత 12 డివిజన్లలో 8 చోట్ల జనసేన పోటీ చేస్తుందని ఆ పార్టీ ఇన్‌చార్జ్ పంచకర్ల సందీప్ ప్రకటించారు. తాజాగా ఆ సంఖ్యను తగ్గించారు. 8 డివిజన్లకు బదులుగా కేవలం 3 చోట్ల మాత్రమే పోటీ చేస్తామని ఆయన తాజాగా మరో కీలక ప్రకటన చేశారు. కూటమి ధర్మాన్ని పాటిస్తున్నామని ఆయన చెప్పుకొచ్చారు.