హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఘనంగా దసరా ఉత్సవాలు ప్రారంభం

అల్లిపురం, నేరెళ్ల కోనేరు సమీపంలోని శ్రీ వీరాంజనేయ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో దసరా ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా అమ్మవారి విగ్రహాన్ని ఏర్పాటు చేసి ప్రత్యేక పూజలను చేశారు. ఈనెల 31వ తేదీ వరకు ఉత్సవాలు నిర్వహిస్తామని, ఇందులో భాగంగా దీపారాధన, అన్న సమారాధన, మహా చండీ హోమం తదితర కార్యక్రమాలు ఉంటాయని నిర్వాకులు వెల్లడించారు.