హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: నర్సీపట్నంలో ఘనంగా మహా చండీయాగం

AKP: నర్సీపట్నం శ్రీ కనకదుర్గ దేవాలయంలో ఇవాళ చండీయాగం నిర్వహించారు. దేవి శరన్నవరాత్రులు ముగిసిన నేపథ్యంలో భవాని దీక్షలు వేసిన భక్తులు చండీ హోమంలో పాల్గొన్న తర్వాత భవాని దీక్షలు విరమిస్తారు. ఈ సందర్భంగా ఆలయ కార్య నిర్వహణ అధికారి సాంబశివరావు ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అనేక దుర్గా దేవాలయాల్లో ప్రత్యేకంగా చండీ హోమం నిర్వహించారు.