హైదరాబాద్: 28°C
తెలంగాణ

చినగుంటూరుపల్లిలో వృద్ధురాలి మృతి

MLG: ములుగు మండలం చినగుంటూరుపల్లిలో మంగళవారం సాయంత్రం కనిపించకుండాపోయిన 70 ఏళ్ల వృద్ధురాలు సమ్మక్క ఇవాళ తెల్లవారుజామున పొలాల్లోని కాలువలో శవంగా కనిపించింది. గ్రామస్తులు పోలీసులకు సమాచారమిచ్చారు. పొరుగున ఉన్న అన్నంపల్లికి చెందిన వ్యక్తిని అనుమానంతో ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. హత్యా, ప్రమాదమా అనేది పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది.