హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నూతన ఎస్సైగా బాధ్యతలు స్వీకరణ

సత్యసాయి: పుట్టపర్తి రూరల్ పోలీస్ స్టేషన్ కొత్త ఎస్సైగా వెంకటరమణ బాధ్యతలు స్వీకరించారు. స్థానిక సంస్థల ఎన్నికలను ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించడమే తమ ప్రధాన లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. ఎన్నికల సమయంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే చట్టపరంగా కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తూ, ప్రజలందరూ పోలీసులకు సహకరించాలని కోరారు.