BPT: టౌన్ పోలీస్ స్టేషన్ వద్ద బుధవారం పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి కలెక్టర్ వినోద్ కుమార్, ఎస్పీ ఉమామహేశ్వర్ హాజరై అమరుల స్థూపానికి నివాళులర్పించారు. అనంతరం పోలీసుల కవాతు, గౌరవ వందనం స్వీకరించారు. విధి నిర్వహణలో అసువులు బాసిన పోలీసుల కుటుంబాలను సన్మానించారు. అంతర్గత భద్రతలో పోలీసుల త్యాగాలు ఎనలేనివని కొనియాడారు.
ఆంధ్రప్రదేశ్
ఘనంగా పోలీసు అమరవీరుల దినోత్సవం


