GNTR: తాడేపల్లి మండలం చిర్రావూరులో మంగళవారం రాత్రి పశువుల పాకలో అగ్ని ప్రమాదం జరిగింది. రైతు టంకశాల గోపాలరావుకు చెందిన పాకలో రాత్రి 11 గంటలకు మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఓ గేదె మృతి చెందగా, మరో 10 గేదెలకు తీవ్ర గాయాలయ్యాయి. సుమారు రూ.20 లక్షల విలువైన పశువులకు నష్టం వాటిల్లింది. పశువులే జీవనాధారంగా ఉన్న రైతు కుటుంబం విషాదంలో మునిగింది.
ఆంధ్రప్రదేశ్
పశువుల పాకలో అగ్ని ప్రమాదం.. గేదె మృతి


