హైదరాబాద్: 28°C
తెలంగాణ

నిద్రలోనే గుండెపోటుతో యువకుడు మృతి

JN: పాలకుర్తి మండలం గూడూరు గ్రామానికి చెందిన నాయిని నరేష్ (29) మంగళవారం రాత్రి మృతి చెందాడు. నరేష్ గుండెపోటుతో నిద్రలోనే కన్నుమూసాడు. ఇవాళ ఉదయం నిద్ర లేవకపోవడంతో, వైద్యుడు పరీక్షించి గుండె పోటుతో మృతి చెందినట్లు నిర్ధారించారు. చిన్న వయసులోనే నరేష్ మృతి చెందడంతో కుటుంబ సభ్యులు బోరున విలపించారు. గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.