హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జడ్పీటీసీ అభ్యర్థిపై ఉత్కంఠ.. ముగ్గురి మధ్య పోటీ!

కోనసీమ: ఆలమూరు జడ్పీటీసీ అభ్యర్థి ఎంపికపై రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది.  మడికి నుంచి దొండపాటి సుబ్బరాజు, చెముడులంక నుంచి నాగిరెడ్డి వెంకటరత్నం, చొప్పెల్ల నుంచి బల్ల హరికృష్ణ పేర్లు పరిశీలనలో ఉన్నాయి. ఐవీఆర్ కాల్స్ ద్వారా అభిప్రాయాలు సేకరించి అభ్యర్థిని ఖరారు చేసేందుకు కసరత్తు జరుగుతున్నట్లు సమాచారం. అభ్యర్థి ప్రకటన వెలువడే అవకాశం ఉండటంతో ఆసక్తి నెలకొంది.