హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బాణాసంచా పేలుడు.. చిన్నారులకు గాయాలు

NTR: బూదవాడలో దసరా ఉత్సవాల్లో అపశృతి చోటుచేసుకుంది. దేవి శరన్నవరాత్రుల ఉత్సవాలు ముగిసిన సందర్భంగా గ్రామస్తులు అమ్మవారి ఊరేగింపు నిర్వహించారు. ఈ క్రమంలో టపాసులు కాలుస్తుండగా, ప్రమాదవశాత్తు దీపావళి బాణాసంచాపై నిప్పు పడి భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో నలుగురు చిన్నారులకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను వెంటనే జగ్గయ్యపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.