తిరుమలలో అర్ధరాత్రి నుంచి కురుస్తున్న వర్షంతో భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం టోకెన్లు లేని భక్తులకు స్వామివారి సర్వదర్శనానికి 6 గంటల సమయం పడుతోంది. వీరు 9 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. నిన్న ఒక్కరోజే 83,745 మంది స్వామిని దర్శించుకోగా, 19,391 మంది తలనీలాలు సమర్పించారు. శ్రీవారికి కానుకల రూపంలో రూ.2.99 కోట్ల హుండీ ఆదాయం వచ్చినట్లు టీటీడీ వెల్లడించింది.
భక్తి
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం


