తిరుమలలో వైభవంగా జరుగుతున్న శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు ఇవాళ్టితో ముగియనున్నాయి. చివరి రోజు ఉత్సవాల్లో భాగంగా ఈరోజు స్వామివారికి పల్లకీ ఉత్సవం, తిరుచ్చి ఉత్సవం నిర్వహించనున్నారు. అనంతరం శ్రీవారి పుష్కరిణి వద్ద స్వామి, అమ్మవార్లకు వేడుకగా స్నపన తిరుమంజనం, చక్రస్నానం నిర్వహిస్తారు. ఈ చక్రస్నాన ఘట్టంతో నవరాత్రి బ్రహ్మోత్సవాలు పరిసమాప్తం కానున్నాయని అధికారులు తెలిపారు.
భక్తి
చక్రస్నానంతో ముగియనున్న శ్రీవారి బ్రహ్మోత్సవాలు


