తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి సర్వదర్శనానికి 6 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. దీంతో టోకెన్లు లేని భక్తులకు స్వామివారి దర్శనానికి 6 గంటల సమయం పడుతోంది. కాగా, నిన్న శ్రీవారిని 85,431 మంది భక్తులు దర్శించుకోగా, 22,966 మంది తలనీలాలు సమర్పించారు. భక్తుల కానుకల ద్వారా నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.20 కోట్లుగా నమోదైందని టీటీడీ తెలిపింది.
భక్తి
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం


