హైదరాబాద్: 28°C
భక్తి

జమ్మి పూజలో చదవాల్సిన శ్లోకం ఇదే

దసరా రోజున జమ్మి చెట్టుకు పూజ చేసేటప్పుడు ఈ శ్లోకాన్ని చదవాలి. 'శమీ శమయతే పాపం, శమీ శత్రు వినాశినీ, అర్జునస్య ధనుర్ధారీ, రామస్య ప్రియదర్శినీ..!!'. దీని అర్థం: జమ్మి పాపాలను హరిస్తుంది. శత్రువులను నాశనం చేస్తుంది. అర్జునుడు ధనస్సును దాచుకోవడానికి, శ్రీరాముడికి విజయాన్ని చేకూర్చడానికి ఈ చెట్టు తోడ్పడింది. అటువంటి శమీ వృక్షానికి నమస్కరిస్తున్నాను, నన్ను ఎల్లప్పుడూ రక్షించు గాక.