హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జిల్లాలో పులి సంచారం

EG: ఉండ్రాజవరం మండలం పసలపూడి, కాలదరి గ్రామాల పొలాల పరిసరాల్లో పులి సంచరిస్తున్నట్లు అటవీ అధికారులు గుర్తించారు. రాంపచోడవరం అటవీ ప్రాంతం నుంచి సీతానగరం మీదుగా వచ్చిన పులి కదలికలను జీపీఎస్ కాలర్, కెమెరాల సాయంతో ట్రాక్ చేస్తున్నారు. సుమారు 30 మంది అటవీ సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు. పసలపూడి, కాలదరి, సూర్యారావుపాలెం గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.