హైదరాబాద్: 28°C
ఆరోగ్యం

సొరకాయతో పాయసం.. ఇలా చేసేయండి!

సొరకాయతో ఆరోగ్యకరమైన, రుచికరమైన పాయసాన్ని తయారు చేసుకోవచ్చు. ముందుగా సొరకాయ పొట్టు తీసి తురుముకోవాలి. నెయ్యిలో జీడిపప్పు, కిస్మిస్ వేయించి పక్కన పెట్టాలి. అదే పాత్రలో సొరకాయ తురుము ఉడికించి, పాలు లేదా కొబ్బరి పాలు, తగినంత బెల్లం లేదా చక్కెర కలపాలి. యాలకుల పొడి వేసి చిక్కబడే వరకు ఉడికించాలి. చివరగా వేయించిన జీడిపప్పు, కిస్మిస్ కలిపితే రుచికరమైన సొరకాయ పాయసం సిద్ధమవుతుంది.