BDK: దసరా పండుగ వేళ కరకగూడెం మండలం రాయన్నపేటలో విషాదం చోటుచేసుకుంది. వ్యవసాయ పొలానికి నీళ్లు పెట్టేందుకు వెళ్లిన సర్ప నితిన్ (20) విద్యుత్ షాక్తో మృతి చెందాడు. విద్యుత్ తీగలకు వైర్లు తగిలిస్తుండగా తెగిపడిన వైరు తగలడంతో ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు. యువకుడి మృతితో కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
తెలంగాణ
విద్యుత్ షాక్తో యువకుడి దుర్మరణం


