SRPT: త్రిపురవరం గ్రామంలోని చెరువు అలుగు వద్ద నీరు వెళ్లే మార్గంలో కట్టలు ఉండటంతో రైతులు, గ్రామ ప్రజలు పొలాలకు వెళ్లేందుకు ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా మహిళలు అవస్థలు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యను తగ్గించేందుకు సర్పంచ్ మాదాసు జ్యోతి కృష్ణ ఆధ్వర్యంలో అలుగు వద్ద పైపులు ఏర్పాటు చేసి మరమ్మతులు చేపట్టారు. ఇందుకు సహకరించిన సర్పంచ్ కు కృతజ్ఞతలు తెలిపారు.
తెలంగాణ
చెరువు అలుగు వద్ద పైపుల ఏర్పాటు


