హైదరాబాద్: 28°C
తెలంగాణ

అమ్మవారికి సర్పంచ్ దంపతుల ప్రత్యేక పూజలు

PDPL: మంథని మండలం చిల్లపల్లిలో దుర్గామాత ఊరేగింపు కార్యక్రమం మంగళవారం వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా గ్రామ సర్పంచ్ గోపు సంతోష్ కుమార్ దంపతులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ.. అమ్మవారి ఆశీస్సులు గ్రామ ప్రజలపై ఎల్లప్పుడూ ఉండాలని, అందరూ సంతోషంగా వేడుకలు నిర్వహించుకోవాలన్నారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపారు.