హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు

SRD: సదాశివపేట పట్టణంలోని భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయంలో విజయదశమి వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఆలయ ఆవరణలో ఉన్న జమ్మి చెట్టుకు ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ప్రత్యేక పూజలు చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ చెడుపై మంచి సాధించిన విజయానికి సంకేతంగా విజయదశమి పండుగ జరుపుకుంటారని చెప్పారు. కార్యక్రమంలో మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ గోపాల్ పాల్గొన్నారు.