హైదరాబాద్: 28°C
తెలంగాణ

యాదాద్రి పవర్ ప్లాంట్లో మరో కీలక ఘట్టం

NLG: యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్లో మరో కీలక ముందడుగు పడింది. ప్లాంట్కు చెందిన 800 మెగావాట్ల సామర్థ్యం గల 5వ యూనిట్ను అధికారులు విజయవంతంగా గ్రిడ్కు అనుసంధానం చేశారు. దీంతో 4,000 మెగావాట్ల లక్ష్యంతో నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టు కార్యకలాపాల దిశగా అడుగులు వేస్తోంది. ఈ కొత్త యూనిట్ అందుబాటులోకి రావడంతో రాష్ట్ర విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం మరింత పెరగనుంది.