హైదరాబాద్: 28°C
తెలంగాణ

కథలాపూర్‌లో ధమ్మచక్ర ప్రవర్తన దినోత్సవం

KMR: బాన్సువాడ మండలం కథలాపూర్ గ్రామంలో మాల కులస్తుల ఆధ్వర్యంలో ధమ్మచక్ర పరివర్తన దినోత్సవాన్ని నిర్వహించారు. పంచశిల జెండా ఆవిష్కరణ చేసి బుద్ధ వందనం చేపట్టారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఆశయాలను స్మరించుకుంటూ, బౌద్ధ ధమ్మం బోధించిన సమానత్వం, శాంతి, సోదరభావం వంటి విలువలను గుర్తుచేసుకున్నారు. పెద్ద సంఖ్యలో మాల కులస్తులు పాల్గొన్నారు.