హైదరాబాద్: 28°C
తెలంగాణ

హామీని నిలబెట్టుకున్న కార్పొరేటర్!

KNR: సీతారాంపూర్ 23వ డివిజన్‌లో ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని కార్పొరేటర్ గుమ్మడి రాజ్ కుమార్ నిలబెట్టుకున్నారు. డివిజన్‌లో ఏ కుటుంబంలోనైనా ఆడపిల్ల జన్మిస్తే, చిన్నారి పేరు మీద రూ.5,116 ఫిక్స్‌డ్ డిపాజిట్ చేస్తానని ప్రకటించారు. ఈ మేరకు, దసరా పండుగ సందర్భంగా ఫిక్స్‌డ్ డిపాజిట్ బాండ్‌ను చిన్నారి తల్లిదండ్రులకు అందజేసి, ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు.