MBNR: కోయిలకొండ మండలం వింజమూరు గ్రామంలో పంచాయతీ కార్మికులకు సర్పంచ్ కుమ్మరి మన్నెమ్మ రాములు దసరా కానుకగా ఒక్కొక్కరికి రూ.2 వేల చొప్పున ఆర్థిక సాయం అందించారు. గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు కృషి చేస్తున్న కార్మికుల సేవలను గుర్తించి ఈ సాయం చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో గ్రామ పెద్దలు, యువకులు పాల్గొన్నారు.
తెలంగాణ
కార్మికులకు దసరా కానుక అందజేత


