హైదరాబాద్: 28°C
తెలంగాణ

శమి చెట్టుకు ప్రత్యేక పూజలు

మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలంలోని గూడెంగుట్ట సత్యనారాయణ స్వామి దేవాలయంలో ఉన్న శమి చెట్టుకు వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. దసరాను పురస్కరించుకుని దేవాలయంలో ఉన్న స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించి విశేష పూజలు చేశారు. సాయంత్రం దేవాలయం ఆవరణలో ఉన్న జమ్మి చెట్టుకు వారు పూజలు నిర్వహించారు. విజయానికి గుర్తుగా విజయదశమిని నిర్వహిస్తారన్నారు.