SRCL: జిల్లా పోలీస్ కార్యాలయంలో విజయదశమి వేడుకలు ఘనంగా జరిగాయి. జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే దుర్గాదేవికి ప్రత్యేక పూజలు చేసి, ఆర్ముడ్ రిజర్వ్‌లో ఆయుధ పూజ, వాహన పూజలు నిర్వహించారు. దసరా ప్రజలందరికీ అన్ని రంగాల్లో విజయాలు, సుఖసంతోషాలు అందించాలని ఆకాంక్షించారు. జిల్లా ప్రజలు, పోలీసు అధికారులు, సిబ్బందికి శుభాకాంక్షలు తెలిపారు.
తెలంగాణ
ఎస్పీ కార్యాలయంలో ఆయుధ పూజ


