హైదరాబాద్: 28°C
తెలంగాణ

పండుగ వేళ మద్యం ప్రియుల ఇక్కట్లు

WGL: వర్ధన్నపేట, రాయపర్తి మండలాల్లో మద్యం దుకాణాలు సిండికేట్ అయినట్లు ప్రచారం జరుగుతోంది. ఉదయం కొంతసేపు తెరిచి మధ్యాహ్నం సమయంలో నిబంధనలకు విరుద్ధంగా వైన్స్‌ను మూసివేశారని మందుబాబులు చెబుతున్నారు. దీంతో మద్యం ప్రియులు బెల్టు షాపులను ఆశ్రయిస్తున్నారు. పండగ పూట అవసరమైన మద్యాన్ని అందుబాటులో ఉంచాలని మద్యం ప్రియులు ఎక్సైజ్ శాఖ అధికారులను డిమాండ్ చేస్తున్నారు.