హైదరాబాద్: 28°C
తెలంగాణ

అగ్ని ప్రమాదం.. రూ.2 లక్షల నష్టం

NRPT: కోస్గి మండలం ముశ్రీపా గ్రామంలో మంగళవారం అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. తలారి బాబు వ్యవసాయ పొలం వద్ద ఉన్న పశువుల కొట్టం, పశువుల మేత గడ్డివాము మంటల్లో కాలిపోయాయి. ఈ ప్రమాదంలో సుమారు రూ.2 లక్షల ఆస్తి నష్టం వాటిల్లినట్లు బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించి నష్టపరిహారం అందించి ఆదుకోవాలని కోరారు.