హైదరాబాద్: 28°C
తెలంగాణ

క్యాన్సర్ బాధితుడికి అండగా రక్తదాత

KMR: ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్యాన్సర్ బాధితుడు చిన్న రాజయ్యకు దోమకొండకు చెందిన లక్కబత్తిని రవికుమార్ 44వ సారి తెల్ల రక్త కణాలను దానం చేశారు. IVF సేవాదళ్ రాష్ట్ర చైర్మన్, రెడ్‌క్రాస్ జిల్లా సమన్వయ సభ్యులు డా.బాలు చొరవతో రవికుమార్ స్పందించి బాధితుడికి సహాయం అందించారు. పండుగ రోజున కూడా రక్తదానానికి ముందుకు రావడం అభినందనీయమన్నారు.