హైదరాబాద్: 28°C
తెలంగాణ

బొడ్రాయి ప్రతిష్ఠలో పాల్గొన్న మంత్రి పొంగులేటి

KMM: నేలకొండపల్లి మండలం మంగాపురం తండాలో మేరమ్మ తల్లి, సేవాలాల్ దేవాలయాల ప్రారంభోత్సవం, బొడ్రాయి ప్రతిష్ఠ కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ఆలయాలను ప్రారంభించారు. అనంతరం బొడ్రాయి వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. సేవాలాల్ దయతో ప్రతి ఒక్కరు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు.