హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఘనంగా కలెక్టర్ జన్మదిన వేడుకలు

ADB: జిల్లా కలెక్టర్ రాజర్షి షా జన్మదిన వేడుకలను మంగళవారం క్యాంపు కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అధికారులు, నాయకులతో కలిసి కేక్ కట్ చేసి మిఠాయిలు పంచారు. జిల్లా అభివృద్ధి, ప్రజా సంక్షేమమే లక్ష్యంగా అధికారులు సమన్వయంతో పనిచేసి ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరువ చేయాలని ఆయన ఆకాంక్షించారు.