హైదరాబాద్: 28°C
తెలంగాణ

పారిశుధ్య కార్మికులకు దసరా కానుకలు అందజేత

VKB: విజయదశమి సందర్భంగా తాండూరు 8వ వార్డు కౌన్సిలర్ జావీద్ ఆదర్శంగా నిలిచారు. పట్టణ పరిశుభ్రతకు పాటుపడుతున్న మున్సిపల్ పారిశుధ్య కార్మికులు, లేబర్‌లు, జవాన్‌లకు తన సొంత ఖర్చులతో కొత్త బట్టలు, నగదును పండుగ కానుకగా అందజేశారు. వారి నిరంతర సేవలను కొనియాడుతూ, కార్మికుల ముఖాల్లో ఆనందం నింపేందుకే ఈ సాయం చేసినట్లు ఆయన తెలిపారు.