హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వ్యాన్‌ ఢీకొని వ్యక్తి మృతి

ఏలూరు జిల్లా మండవల్లి మండలంలోని భైరవపట్నం శివారులో మంగళవారం రోడ్డు ప్రమాదం జరిగింది. మండవల్లి నుంచి కైకలూరు వైపు వెళ్తున్న బొలెరో వాహనం.. ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనాన్ని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కానుకొల్లు గ్రామానికి చెందిన కందుల నాగేశ్వరరావు (48) తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందారు. దీంతో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలముకొన్నాయి