హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

టీడీపీని వీడి వైసీపీలోకి తాళ్ల కొండలు

PLD: మాచర్ల పట్టణంలోని వైసీపీ కార్యాలయంలో 24వ వార్డు మాజీ కౌన్సిలర్ తాళ్ల కొండలు టీడీపీని వీడి వైసీపీలో చేరారు. ఈ సందర్భంగా వైసీపీ పల్నాడు జిల్లా అధ్యక్షుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆయనకు పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ చేరికతో మాచర్లలో పార్టీకి మరింత బలం చేకూరుతుందని వైసీపీ శ్రేణులు అభిప్రాయపడ్డాయి.