హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ప్రశాంత ఎన్నికలకు సహకరించాలి: ఆర్వో

ప్రకాశం: పొన్నలూరు MPTC, ZPTC ఎన్నికల నిర్వహణపై పొన్నలూరు MPDO కార్యాలయంలో రాజకీయ పార్టీల నాయకులతో సమావేశం నిర్వహించారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారి నాగమణి ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో నామినేషన్ల ప్రక్రియ, ఎన్నికల నియమావళి అమలు తదితర అంశాలపై చర్చించారు. ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా అన్ని పార్టీల నాయకులు సహకరించాలని, ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావివ్వకూడదని ఆమె సూచించారు.