హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కుటుంబ సమేతంగా పూజల్లో పాల్గొన్న ఎస్పీ

GNTR: దసరా పర్వదినాన్ని పురస్కరించుకుని జిల్లా పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో నిర్వహించిన ఆయుధ పూజల్లో ఎస్పీ వకుల్ జిందాల్ కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. ఆయుధాగారంలో దుర్గామాత చిత్రపటాన్ని ఏర్పాటు చేసి వివిధ రకాల ఆయుధాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కర్పూర హారతి సమర్పించి, ప్రజలందరూ సుఖశాంతులతో జీవించాలని, జిల్లా ప్రశాంతంగా ఉండాలని అమ్మవారిని ప్రార్థించారు.