హైదరాబాద్: 28°C
తెలంగాణ

శాకెర గ్రామానికి స్వర్గలోక రథం విరాళం

NRML: సోన్ మండలం శాకెర గ్రామానికి చెందిన సిరిగిరి వెంకటి, రాజమణి దంపతులు తమ కుమారుడు దివంగత ఆర్థిక్ జ్ఞాపకార్థం రూ.2.5 లక్షల విలువైన స్వర్గలోక రథాన్ని గ్రామానికి విరాళంగా అందజేశారు. ఉమ్మడి మండల పరిషత్ మాజీ అధ్యక్షుడు వీ.సత్యనారాయణ గౌడ్ సమక్షంలో సర్పంచ్ లక్ష్మి ఉదయ్ కుమార్, గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులకు రథాన్ని అందించారు.