హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కార్పొరేషన్లో గ్రీవెన్స్ కొనసాగించాలి

KKD: స్థానిక సంస్థల ఎన్నికల పరిధిలో కాకినాడ నగరపాలక సంస్థ లేనందున PGRSను యథావిధిగా నిర్వహించాలని పౌర సంక్షేమ సంఘం కన్వీనర్ దూసర్లపూడి రమణరాజు డిమాండ్ చేశారు. విలీన ప్రక్రియల నేపథ్యంలో ఎన్నికలకు ఇంకా సమయం ఉందన్నారు. నగరంలో వీధి దీపాలు, పారిశుద్ధ్యం, మురుగు కాలువలు, వీధి కుక్కల సమస్యలు తీవ్రంగా ఉన్నాయని పేర్కొన్నారు.