హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వైద్యానికి వెళ్తే... ఇల్లు లూటీ!

EG: తాళ్లపూడి మండలం వేగేశ్వరపురానికి చెందిన పేరిశాస్త్రి, భార్య అనంతలక్ష్మి వైద్యం కోసం నెల క్రితం హైదరాబాద్ వెళ్లగా, వారి తాళం వేసిన ఇంటి తలుపులు ధ్వంసం చేసి దొంగలు లూటీ చేశారు. స్థానికుల సమాచారంతో దంపతులు గ్రామానికి వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుల ప్రకారం ₹80 వేల నగదు, 12 కిలోల వెండి, 70 గ్రాముల బంగారం, టీవీ చోరీకి గురయ్యాయి.