హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బావిలో పడి యువకుడు మృతి

NTR: పెనుగంచిప్రోలు (M) లింగగూడెం శివారులో విషాదం చోటుచేసుకుంది. గఫార్ అనే యువకుడు వ్యవసాయ బావిలో పడి మృతిచెందాడు. సమాచారం అందుకున్న స్థానికులు 48 గంటల పాటు గాలింపు చేపట్టారు. చివరకు బావిలోని నీటిని మోటార్ల సాయంతో తోడివేసి, 20 అడుగుల లోతులో ఉన్న మృతదేహాన్ని వెలికితీశారు. మృతుడు పెనుగంచిప్రోలు డౌన్ సెంటర్‌కు చెందిన గఫార్‌గా గుర్తించారు.