హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: గారెపల్లిలో జమ్మి చెట్టుకు ప్రత్యేక పూజలు

BHPL: కాటారం మండలం గారెపల్లి గ్రామంలో విజయదశమి సందర్భంగా భక్తులు జమ్మి చెట్టుకు శమీ పూజలు నిర్వహించారు. సంప్రదాయబద్ధంగా పూజలు చేస్తూ శమీ శమయతే పాపం.. శమీ శత్రు వినాశనం అంటూ ప్రార్థనలు చేశారు. శమీ వృక్షాన్ని పూజించడం వల్ల పాపాలు, శత్రు బాధలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం.