హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

టిడ్కో గృహ నిర్మాణ పనుల్లో కార్మికుల ఆందోళన

NTR: జగ్గయ్యపేట టిడ్కో గృహ నిర్మాణ పనుల్లో ఎనిమిది నెలలుగా పనిచేసిన 24 మంది ప్లంబర్ కార్మికులు తమకు రావాల్సిన రూ.6.50 లక్షల బకాయిలు చెల్లించలేదని ఆందోళనకు దిగారు. బకాయిలు అడిగినందుకు తమను ప్రాంగణం నుంచి బయటకు పంపించారని ఆరోపించారు. కాంట్రాక్టు సంస్థల మధ్య చిక్కుకున్న తమ సమస్యను పరిష్కరించాలని, అధికారులు తక్షణమే జోక్యం చేసుకోవాలని కార్మికులు డిమాండ్ చేశారు.