హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జిల్లాలో ZPTC, MPTC ఎన్నికలకు సై

ATP: అనంతపురం, సత్యసాయి జిల్లాల్లో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. ఈ నెల 23 వరకు నామినేషన్ల స్వీకరణ, 27న ఉపసంహరణకు గడువు నిర్ణయించారు. నవంబర్ 3న పోలింగ్, 5న ఓట్ల లెక్కింపు నిర్వహించనున్నారు. అనంతపురం జిల్లాలో 31 జడ్పీటీసీ, 450 ఎంపీటీసీ స్థానాలు, సత్యసాయి జిల్లాలో 32 జడ్పీటీసీ, 397 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి.