PLD: విజయదశమి సందర్భంగా పల్నాడు జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ జగదీష్ అదహళ్లి దంపతులు శ్రీ కనకదుర్గ అమ్మవారికి పూజలు, ఆయుధ పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రజలకు, పోలీస్ అధికారులు, సిబ్బందికి ఎస్పీ దసరా శుభాకాంక్షలు తెలిపారు. చెడుపై మంచి సాధించిన విజయానికి దసరా ప్రతీక అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ రోహిత్ కుమార్ చౌదరి పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
ఎస్పీ దంపతుల ఆయుధ పూజ


