హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అమ్మవారి సేవలో ఎమ్మెల్యే

SKLM: విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని పాతపట్నంలోని శ్రీ నీలమణి దుర్గ అమ్మవారిని ఎమ్మెల్యే గోవిందరావు కుటుంబ సమేతంగా మంగళవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, నియోజకవర్గ ప్రజలు సుఖసంతోషాలతో, సుభిక్షంగా ఉండాలని ప్రార్థించారు. అనంతరం తన వాహనాలకు ఆలయ సన్నిధిలో శాస్త్రోక్తంగా వాహన పూజలు చేయించారు.