హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వైసీపీ నేతలు టీడీపీలో చేరిక

GNTR: మంత్రి లోకేష్ సమక్షంలో వైసీపీ నేతలు దామర్ల కుబేరస్వామి, తోలేటి రవీంద్ర, షేక్ అబ్దుల్ సలాంతో పాటు వారి కుటుంబ సభ్యులు, పలువురు కార్యకర్తలు టీడీపీలో చేరారు. ఉండవల్లిలో లోకేష్ వారికి పసుపు కండువాలు కప్పి ఆహ్వానించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో గుత్తికొండ ధనుంజయరావు, నందం అబద్దయ్య, పాల్గొన్నారు.