హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎమ్మెల్యే కార్యాలయంలో ఆయుధపూజ

BPT: విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని చీరాల క్యాంపు కార్యాలయంలో సంప్రదాయబద్ధంగా ఆయుధ పూజ నిర్వహించారు. టీడీపీ అధికార ప్రతినిధి మద్దులూరి మహేంద్ర నాథ్ భద్రతా సిబ్బంది, పార్టీ నాయకులతో కలిసి ఈ వేడుకల్లో పాల్గొన్నారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక అయిన దసరా పర్వదినం ప్రజలందరిలో ధైర్యం, ఐక్యత నింపాలని ఆకాంక్షించారు.